పగిలిపోయిన మిషన్ భగీరథ.. వాటర్ పైపులైను మరమ్మతులు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 29, 2020

పగిలిపోయిన మిషన్ భగీరథ.. వాటర్ పైపులైను మరమ్మతులు


మేడ్చల్ జిల్లా ఆగస్టు 28 (శుభ తెలంగాణ) : ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని అంబెడ్కర్ కూడలి వద్ద ఎదులబాద్ రోడ్ నందు గురువారం రాత్రి పగిలిపోయిన మిషన్ భగీరథ వాటర్ పైపు లైన్ విషయమై స్థానిక టిఆర్ఎస్ నాయకుడు ఎస్కీ సలీం, ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి , శుక్రవారం నూతన పైప్ లైన్ వేయించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రధాన రహదారి సైతం పగలకొట్టి పనులు చేస్తున్నామని, కావున వాహనదారులు ఈ ఇబ్బంది కి కాస్త సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వసంత, 11వ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్, 14వ వార్డు కౌన్సిలర్ బండారు వసంత, మున్సిపల్ మేనేజర్ శ్రీదర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.