వరంగల్‌లో తగ్గని వరద ఉదృతి! - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 18, 2020

వరంగల్‌లో తగ్గని వరద ఉదృతి!


వరంగల్, ఆగస్టు 17(శుభ తెలంగాణ): వరంగల్ మహానగరంలో వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎడ తెరపి కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలం కాగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలయమమయ్యా యి. శనివారంతో పోలిస్తే ఆది వారం వర్షం తగ్గినా వరద ఉధృ తి తగ్గకపోవడంతో అధికార యంత్రాంగం అంతా సహాయక, పునరావాస చర్యల్లో వేగం పెం చింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశరావు, అధికార యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యల్లో నిమగ్నమైంది. జలదిగ్బంధంలో చిక్కుకున్న 3200 మంది నగరవాసులను 13 పునరావాస శిబిరాలకు తరలించా రు. మరోవైపు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హైద రాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరే షన్ నుంచి వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 40 మంది ఆదివారం నగరానికి చేరుకున్నారు. భారీ వర్షాలకు హన్మకొండకరీంనగర్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండంతో గోదావరి ఉ ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహంతో గోదావరి మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద నీటి మట్టం 10.660 మీటర్లకు చేరింది. 11 మీటర్లకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు.

Post Top Ad