చురుకుగా పల్లె ప్రగతి వనాల పనులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 01, 2020

చురుకుగా పల్లె ప్రగతి వనాల పనులు..


మణుగూరు, జూలై 31(శుభ తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామ పంచాయితీ నందు శుక్రవారం సర్పంచ్ కాయం తిరుపతమ్మ ఆధ్వర్యంలో చురుకు గా పల్లె ప్రగతి వనాల (పార్క్) నిర్మాణం పనులు శుక్రవారం పరిశీలిం చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పార్క్ నందు మంచి పూల మొక్కలు అహాలదకరంగా వుండేటువంటి మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. పార్క్ చుట్టూ పెన్సింగ్ వేయడం జరిగిదని, లోపల ఉదయం సాయంత్రం వేళల్లో ప్రజలు వాకింగ్ చేసుకునేందు కు వీలుగా రోడ్డుకు మార్జిన్ తీయడం జరిగిందనారు. ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయితీ పాలకవర్గ సభ్యులు ఈజిఎస్ సిబ్బంది, గ్రామ పంచాయితీ సిబ్బంది, పంచాయితీ కార్యదర్శి, సారెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు.