నేడు మంత్రి పువ్వాడ పర్యటన... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 28, 2020

నేడు మంత్రి పువ్వాడ పర్యటన...


భద్రాద్రి జిల్లా బ్యూరో ఆగస్టు 27(శు భ తెలంగాణ) : జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం పర్యటించనున్నారని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేం ద్ర రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఉదయం 10:00 గంటలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వర్ రావు లచే కొత్తగూడెం ప్రభుత్వ హాస్పటల్ నందు కోవిడ్ మొబైల్ టెస్టింగ్ వాహనము, మూడు అంబులెన్సులను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. కావున టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయ కులు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన వలసిందిగా ఆయన తెలిపారు.