మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 12, 2020

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం..


సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ): పటాన్ చెరువు పట్టణంలో మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు బందిసంజయ్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎల్.మహేందర్ జిల్లా కార్యదర్శి మరియు అధ్యక్షుడు కొల్కురి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలతో కలిసి జగ్జీవన్ రావు విగ్రహం దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోకు కార్యకర్తల సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది. భారత దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్మి నరేంద్ర మోడీకి ఓటు వేసి ప్రధానమంత్రిగా గెలిపించినందుకు ఆయన కాశ్మీర్ 370)కానీ, త్రిపుల్ తలాక్ కానీ, కానీ, హిందువుల చిరు స్వప్నం ఐదు వందల సంవత్సరాల రామ మందిరానికి భూమి పూజ చేయడం. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా పది కోట్ల మంది రైతులకు 17 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లో జమ అయ్యేటట్టు విడుదల చేయడం జరిగింది. ఆరు విడుతలకు కలిపి లక్షకోట్ల రూపాయలు రైతులు అకౌంట్లో జమ చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా, నాగరాజు యాదవ్, మురళీధర్ వర్మ, బాబుసింగ్,రాజు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.