గణేష్ మండపాలకు అనుమతిలేదు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 20, 2020

గణేష్ మండపాలకు అనుమతిలేదు


భద్రాచలం 19 ఆగస్టు (శుభ తెలంగాణ) : కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భద్రా చలం డివిజన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22వ తేదీన నిర్వహించు కోనే వినాయకచవితి పండుగ సందర్భంగా సామూహిక పూజలతో పాటు, బహిరంగ ప్రదేశాలలో గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వహణకు మండలపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేనందున, ప్రజలం దరు ఎవరి ఇంటి వద్ద వారే వినాయక చవితి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సి ఉంటుందని, మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు తమ ఇంటిలోనే నిర్వహించుకోవాలని సూచించారు. కోవిడ్ 19 నేపథ్యంలో పోలీసుల సూచనను పాటించి కరోనా వ్యాధిని నియంత్రించడంలో ప్రజలందరు తమ వంతు బాధ్యతగా పోలీసులకు సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు సహకరించగలరని కోరారు.

Post Top Ad