ఉద్యోగ విరమణ పొందిన.. రేవు సీతారాంకు ఆత్మీయ సన్మానం... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 01, 2020

ఉద్యోగ విరమణ పొందిన.. రేవు సీతారాంకు ఆత్మీయ సన్మానం...


మణుగూరు, జూలై 31 (శుభ తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియా లో డీజీఎం పర్సనల్ గా విధులు నిర్వహిస్తూ శుక్రవారం పదవీ విరమణ చేసిన రేవు సీతారాం జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో పర్సనల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎ టు జియం జోగ వెంకటేశ్వర్లు, పర్సనల్ మేనేజర్ అజయ్ కుమార్ లు మాట్లాడుతూ 38 సంవత్సరాల పాటు సింగరేణిలో విధులు నిర్వహిస్తూ అంచెలం చెలుగా ఎదుగుతూ డిజీఎం స్థాయికి చేరిన సీతారాం రాజీపడని మనస్తత్వంతో అంకితభావంతో పని చేశారని కొనియాడారు. ఉ ద్యోగులకు సంబంధించి సమస్యలు చాకచక్యంగా పరిష్కరిస్తూ, అందరి ఆత్మీయ అధికారిగా మన్ననలు పొందారని అభినందిస్తూ వారి శేష జీవితం సుఖమయం కావాలని ఆకాంక్షించారు. రేవు సీతారాం ప్రసం గిస్తూ నిజాయితీ నిబద్ధతతో పని చేసేవారికి సింగరేణిలో ఉజ్వల భవిష్యత్తు తప్పుక ఉంటుందన్నారు. కావున సింగరేణిలో కొత్తగా చేరిన యువతరం అంకితభావంతో పనిచేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ తనకి జరిగిన సన్మానం పట్ల అందరికీ ధన్యవాదాలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ అధికారులు సింగు శ్రీనివాస్, వి.రామేశ్వరరావు, మాధర్ సాహెబ్, పి అవినాష్, మినిస్టియల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.