గజ్వేల్: 18ఆగస్ట్ (శుభ తెలంగాణ) : గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గజ్వేల్ మండల వ్యాప్తంగా కూలిపోయిన ఇండలను అదేవిధంగా నష్టపోయిన పంటలను సిపిఎం బృందం ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని క్యాసారం అదేవిధంగా గజ్వేల్ మండలంలోని దాచారం, సింగాటం పలు గ్రామాల్లో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య మాట్లా డుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూలిపోయిన ఇళ్ల బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని పునరావాసం కల్పించాలని అన్నారు. అదేవిధంగా అనేక మంది రైతులు తమ పంట నీట మునగడం వల్ల ఎంతో ఆవేదన లో ఉన్నారని వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాజు, హనుమంతు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.