ముంపు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అందించండి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 20, 2020

ముంపు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అందించండి


చర్ల మండలం 19 ఆగస్టు (శుభ తెలంగాణ): గోదావరి వరద తగ్గుతున్న ముంపు ప్రాంతాలకు వెంటనే విద్యుత్ సరఫరాను పునః ప్రారంభించాలని భద్రాచలం విద్యుత్ శాఖ ఏడిఈ నంద రాథోడ్ విద్యుత్ అధికారులకు సూచించారు. బుధవారం చర్ల మండలంలోని ముంపు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగ దారులను ఎవరు ఇబ్బంది పెట్టకుండా సక్రమమైన సేవలు అందించాలని సూచించారు. అధిక వర్షాల కారణంగా రైతులు విద్యుత్ వినియోగంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ వినియోగదారులు ఇంటికి సంంధించిన సర్వీస్ వైర్లని, వాటితో వెలాడే ఇనుపతీగలను కానీ కరెంట్ స్తంభాలను. ఇనుప స్తంభాలను ముట్టుకొనే ప్రయత్నం చేయకూడదని అన్నారు. విద్యుత్ షాక్ తో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే నేరుగా కార్యాలయంకు వచ్చి సమస్య ఉన్నట్లయితే వెంటనే సమస్య పరిష్కరిస్తామని చర్ల విద్యుత్ అధికారి మోహన్ రెడ్డి ఎం తెలిపారు. పర్యటనలో శంకర్ ,వెంకటేశ్వర్లు ఎల్ ఐ లు సిబ్బంది ఉన్నారు.

Post Top Ad