చదువుల సాధనాలు లేకుండా.. డిజిటల్ పాఠాలు ఎలా? - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 29, 2020

చదువుల సాధనాలు లేకుండా.. డిజిటల్ పాఠాలు ఎలా?


గజ్వేల్: 28ఆగస్టు (శుభ తెలంగాణ) : గజ్వేల్ పరిధిలో ప్రతి పల్లెల్లో విద్యార్థి భవిష్యత్ కరోన ప్రభావంతో తారుమారు అయ్యే పరిస్థితులు వేరే ఉన్నాయి కానీ ప్రతి విద్యార్థికి డిజిటల్ పాఠాలు చేరాలని విద్యాశాఖ లక్ష్యం పెట్టుకున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే అంత సులభంగా అది నెరవేరేలా కనిపించడం లేదు. ఇళ్లలో టీవీలు లేకపోవడం, డిష్ కనెక్షన్లు ఉన్న వాటిలో టీషాట్ చానళ్ల ప్రసారాలు రాకపోవడం వంటివి ఎదురు కానున్నాయి. ప్రణాళిక రూపొందించిన కూడా అమలులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో వారిలో 1.70 లక్షల మందికి పైగా విద్యార్థుల ఇళ్లలో టీవీలు లేవని విద్యాశాఖ ప్రాథమిక సర్వేలో తేలింది. అందుకే విద్యాశాఖ మార్గదర్శకా ల్లో టీవీలు లేనివారికి గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయంలో టీవీ సౌకర్యం కల్పించాలని లేకుంటే విద్యార్థుల సమీపంలోని ఇళ్లలో ఇతర పిల్లలకు కలిసి పాఠాలు వినాలని సూచించింది.