కూన మహాలక్ష్మి నగర్ లో తాగునీటి సమస్య - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 25, 2020

కూన మహాలక్ష్మి నగర్ లో తాగునీటి సమస్య


కుత్బుల్లాపూర్ ఆగస్టు 24(శుభ తెలంగాణ) గాజులరామారం సర్కిల్ జగద్దిరిగుట్ట డివిజన్ పరిధిలోని కూన మహాలక్ష్మినగర్ లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య డ్రైనేజీ సమస్యలపై స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు బస్తీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని అలాగే తాగునీరు సరఫరా లో ఇబ్బందులు ఉన్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు దీంతో స్పందించిన కార్పోరేటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడ తామని తెలిపారు. తాగునీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ శివ నాయకులు ఎర్ర లక్ష్మయ్య వెంకటేష్ సంతోష్ సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad