తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. ఆదిలాబాద్‌లో ఊహించని రీతిలో పెరుగుదల - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, August 10, 2020

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. ఆదిలాబాద్‌లో ఊహించని రీతిలో పెరుగుదల


ఆదివారం తెలంగాణలో 1256 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ అని తేలింది. సెలవు దినం కావడంతో సాధారణ రోజులతో పోలిస్తే.. తక్కువ సంఖ్యలో టెస్టులు చేయడంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. ఆదివారం రాష్ట్రంలో మొత్తం 11,609 టెస్టులు చేయగా.. 1700 శాంపిళ్ల ఫలితం తేలాల్సి ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6,24,840 మందికి కోవిడ్ టెస్టులు చేయగా.. 80,751 మందికి పాజిటివ్ అని తేలింది.

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 389 కేసులు నమోదు కాగా... రంగారెడ్డిలో 86, సంగారెడ్డి 74, కరీంనగర్ 73, వరంగల్ అర్బన్ 67, ఆదిలాబాద్ 63, నల్గొండ 58 చొప్పున కరోనా కేసులను గుర్తించారు. అన్ని జిల్లాల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గగా.. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా 63 పాజిటివ కేసులను గుర్తించడం గమనార్హం.

ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా కేసులేవీ నమోదు కాలేదు. వారం రోజుల వ్యవధిలో మూడు రోజులపాటు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం గమనార్హం. ఆదివారం భువనగిరి, ములుగు జిల్లాల్లో మూడు చొప్పున కొత్త కేసులను గుర్తించారు. రాష్ట్రంలో ఆదివారం 10 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 637కి చేరింది.