శాంతినగర్, పోచంపల్లి.. చెరువుల అలుగులను మళ్లిస్తాం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 22, 2020

శాంతినగర్, పోచంపల్లి.. చెరువుల అలుగులను మళ్లిస్తాం..


మణుగూరు అగష్టు 21 (శుభతెలంగాణ): పగిడేరు గ్రామపంచాయతీ పరిధిలో గల చెరువుల అలుగులు మళ్లీస్తామని జడ్పిటిసి పోశం నర్సింహారావు అన్నారు. శుక్రవారం పగిడేరు గ్రామపంచాయతీలోని శాంతినగర్, పాత పగిడేరు అలుగుల కారణంగా ఏర్పాడిన ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు ద్వారా ఈ రెండు తెలుగులను గ్రామంలోకి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తామన్నారు. రామానుజవరం, పగిడేరు బిటి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయన్నారు. వర్షాలు తగ్గిన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభ మౌతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కారం విజయకుమారి, ఎంపిటిసి కుంజా క్రిష్ణకుమారి, సర్పంచ్ తాటి సావిత్రి, మండల, పట్టణ అధ్యక్షులు ముత్యంబాబు, అడపా అప్పారావు, పిఎసిఎస్ డైరెక్టర్ పప్పుల ప్రసాద్, గువ్వ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.