దళిత రైతు మృతి కారణంగా.. తహశీల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 01, 2020

దళిత రైతు మృతి కారణంగా.. తహశీల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన...


గజ్వేల్ జులై 31 (శుభ తెలంగాణా ప్రతినిధి) : శుక్రవారం గజ్వేల్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో వేలూరుకు చెందిన దళిత రైతు బాగరి నర్సింలు మృతి కారణంగా గజ్వెల్ తసీల్దార్ కార్యలయం ముందు నిరసన తెలుపుతూ 18 గుంటల భూమి తీసుకున్న ఈ ప్రభుత్వం ఆ రైతు మరణం తరువాత ఎకరం భూమి, 2 లక్షల పరిహారం ఇస్తామనడం చాలా దారుణం దీన్ని బిజెపి పార్టీ తీవ్రంగ ఖండిస్తున్నది రైతే రాజు అన్న ఈ ప్రభుత్వం దళితులపై చేస్తున్న అరచకల పై బిజేపి పార్టీ తీవ్రంగా పోరాడుతుంది అని నిరసన వ్యక్తంచేస్తున్నాము. ఈ కార్య క్రమంలో బిజెపి పట్టణశాఖ అధ్యక్షుడు ఉప్పుల మధుసూధన్, పట్టణ ప్రధాన కార్యదర్శి తుం శ్రీధర్ బిజెపి మండల అధ్యక్షులు మహేష్. శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కుమారస్వామి, సురేష్, రవి రాజు', శ్రీకాంతు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.