దేశ నవనిర్మాణంలో భాగస్వాములవ్వడం అందరి బాధ్యత : బిజెపి నాయకులు వెంకటేష్ గౌడ్.... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 16, 2020

దేశ నవనిర్మాణంలో భాగస్వాములవ్వడం అందరి బాధ్యత : బిజెపి నాయకులు వెంకటేష్ గౌడ్....  హైదరాబాద్ 15 ఆగస్టు ( శుభ తెలంగాణ) శనివారం ఉస్మానియా యూనివర్సిటీ లోని మాణికేశ్వర్నగర్ లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు  వెంకటేష్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఎందరో స్వాతంత్ర సమరయోధులు దేశాన్ని బానిస సంకెళ్ళ నుండి విముక్తి చేయడానికి ప్రాణాలు సైతం లెక్కచేయలేదని వీరందరినీ మనం గౌరవించుకోవాలి అని. దేశ నవనిర్మాణంలో భాగస్వామివ్వడం  అందరి బాధ్యత అని అన్నారు. ఈ  కార్యక్రమంలో రాము వర్మ, శ్రీనివాస చారి, సతీష్ రెడ్డి ఆకుల శ్రీనివాస్, విశ్వనాథ్ ముదిరాజ్, అయ్యప్ప రెడ్డి, శ్రీనివాస్ గంగరాజు, అమిత్ర, గోవర్ధన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు..