పివికి భారత రత్న కోసం.. అసెంబ్లీలో తీర్మానం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 29, 2020

పివికి భారత రత్న కోసం.. అసెంబ్లీలో తీర్మానం


హైదరాబాద్, ఆగస్టు 28(శుభ తెలంగాణ): తెలంగాణ ముద్దుబిడ్డ, దేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావుకు సంబంధించి ముఖ్య మంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించా రు. అలాగే నెక్లెస్ రోడ్డుకు పీవీ జ్ఞాన్ మార్గ గా పేరు పెట్టాలని, హైదరాబాద్ లో పీవీ మెమోరియ ల్ ఏర్పాటుకు కేసీఆర్ సంకల్పిం చారు. ఈ మేరకు ప్రగతిభవన్లో పీవీ శతజయంతి వేడుకల నిర్వ హణపై శు క్రవారం సీఎం కేసీ ఆర్ ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శి టీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ సాహసోపేతమైన భూ సంస్కరణ లు అమలు చేశారని ఈ సంద గ్భంగా గుర్తుచేశారు. ఆయన సంస్కరణల ఫలితంగానే తెలం గాణలో 93 శాతం మంది చిన్న, సన్నకారు రైతులకు భూమి వచ్చిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చడంతో పాటు.. అనేక రంగాల్లో సంస్కరణలు తెచ్చిన పీవీ ఆదర్శప్రాయుడని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పీవీకి మరిం త గౌరవం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. లక్నేపల్లి, వంగర గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. పీవీ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వ హించాలని అధికారులను ఆదేశించా రు. దేశ,విదేశాల్లో కూడా పీవీ శత జయంతి వేడుకలు నిర్వహిం చాలన్నారు. పార్లమెంట్ లో మాజీ ప్రధాని విగ్రహం ప్రతిష్టించా లని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ సమీక్షలో కెకె,మంత్రులు ఈటెల రాజేందర్, శ్రీనివాస గౌడ్, కెవి రమణాచారి, రాజీవ్ శర్మ, దేశపతి శ్రీనివాస్, టంకశాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.