కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 04, 2020

కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత..


రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ వ్యాప్తంగా రాఖీ సంబరాలు ఘనంగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు రాఖీ కట్టారు నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, చెల్లెలు సౌమ్య, మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి కవిత ప్రగతి భవన్ లో రాఖీ కట్టారు. పండగ శుభాకాంక్షలు తెలిపిన కవిత.. తన సోదరుడి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు కవిత రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సునీతారెడ్డి తదితరులు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. మరోవైపు మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే గొంగడి సునీత, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భార్య గండ్ర జ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ సతీమణి శ్రీమతి శైలిమ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. మరోవైపు మహిళా నేతలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హరీశ్ రావు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ దృష్ట్యా ఆత్మీయ రక్షాబంధన్ తో పాటు స్వీయరక్షణ పాటించా లని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాఖీ సంబరాలు నిర్వహించుకుంటున్నారు.