కేసీఆర్ మూఢనమ్మకాలతో క్రిమినల్ చర్యలు, దోషులుగా నిలబెడతాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, August 17, 2020

కేసీఆర్ మూఢనమ్మకాలతో క్రిమినల్ చర్యలు, దోషులుగా నిలబెడతాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా మరణాలపై ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోందని అన్నారు. తమ పరిధిలో కరోనాతో చనిపోయిన వారి వివరాలను గాంధీభవన్‌కు అందజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కరోనాతో చనిపోయిన పేదలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు.సచివాలయంలోని అతి పురాతన దేవాలయం, మసీదును కూల్చడం కేసీఆర్ దుర్మార్గపు పాలనకు నిదర్శనమని విమర్శించారు. కేవలం తన మూఢనమ్మకాల కోసం వీటిని కూల్చివేయించారని కేసీఆర్‌పై మండిపడ్డారు. ఈ అంశాలను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళతామని చెప్పారు.సచివాలయంలో దేవాలయాన్ని, మసీదు కూల్చివేతపై న్యాయం కోసం ఎంతవరకైన పోరాటం చేస్తామని, ఇది క్రిమినల్ చర్య అని అన్నారు. దీన్ని పార్లమెంటులో సైతం లేవనెత్తుతామన్నారు. ఈ విషయంలో కేసీఆర్‌తో ఒవైసీ సోదరులు ఏం ఒప్పందం చేసుకుని మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. ఎంఐఎంను ఈ విషయంలో ప్రజల్లో దోషులుగా నిలబెడుతామన్నారు. ఆగస్టు 22న అన్ని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని ఉత్తమ్ తెలిపారు.