జెఇఇ, నీట్ పరీక్షలను.. వాయిదా వేయండి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 29, 2020

జెఇఇ, నీట్ పరీక్షలను.. వాయిదా వేయండి


న్యూఢిల్లీ, ఆగస్ట్ 28 : జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్ వాయిదా కోరు తూ ఓ వైపు కాంగ్రెస్ తదితర పార్టీలో ఆందోళనకు దిగగా.... ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పశ్చిమ బెంగా ల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు సంయుక్తంగా శుక్రవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. జేఈఈ, నీట్ నిర్వహణపై ఆగస్టు 17న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని కోరారు. ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు భారీ వర్షాలు, వరదల వల్ల తమ తమ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయిని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని ఆయా రాష్ట్రాల మంత్రులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో బుధవారం ప్రతిపక్ష పార్టీల పాలిత ఏడు రాష్ట్రాల సీఎంల ఆన్లైన్ సమావేశం జరిగింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాగెల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు. జీఈఈ, నీట్ వాయిదాకు ఉమ్మడిగా పోరా డాలని, సుప్రీంకోర్టులో సమీక్ష కోరాలని ఈ సందర్భంగా సీఎంలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు సంయుక్తంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. జేఈఈ, నీట్ వాయిదాకు పలు రాష్ట్రాల సీఎంలు ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పటి కే చాలాసార్లు వాయిదా పడిన ఈ పరీక్షలను ఈసారి నిర్వహించాల న్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దీంతో జేఈఈ, నీట్ నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 85 శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 18న నీట్ జరుగనున్నాయి.

Post Top Ad