మణుగూరు ఆగస్టు 27 (శుభ తెలంగాలు) మండల పరిధిలోని కూనవరం గ్రామ పంచాయతీ లో ఇటీవల వచ్చిన వరదలకు నీట మునిగి నష్ట పోయిన పంటలను అశ్వారావుపేట ఏఈఓ రాయుడు, మణుగూరు ఏఈఓ వీరేంద్ర స్థానిక సర్పంచ్ ఎనికే. ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం సర్వే నిర్వహించారు. అతిసృష్టి అనావృష్టి తో కురిసిన వర్షాలకు పంట పొలాలోకి భారీగా నీరు చేరి చెరువు లా తలపించాయి. వాగులు, చెరువులు అలుగు పారి పొలాల్లో ఇసుక, ఒండ్రు మట్టితో నిండి ఉండడం తో పైరులు కనుమరుగు అయ్యాయి. దీంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడం తో అధికారులు సర్వే లు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం కూనవరం గ్రామ పంచాయితీ లో అధికారులు, ప్రజా ప్రతినిధులు సర్వే చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు గుదిపూడి రోటేశ్వరరావు, రైతులు ఎలిబోయిన. సమ్మయ్య, కృష్ణ, వంక అర్జునరావు, బిత్తుల నాగేశ్వరరావు, ఎనికే లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.