మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య.. కరోనాతో మృతి! - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 05, 2020

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య.. కరోనాతో మృతి!


సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసన సభ్యులు సున్నం రాజయ్య (60) అకాల మృతి బాధాకర మని సిఐటియు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ . చంద్రశేఖర్ సంతాపాన్ని ప్రకటించారు. గత వారం రోజుల నుంచి అనా రోగ్యంతో బాధపడుతూ, కరోనా పాజిటివ్ రావడంతో సోమవారం అర్ధరాత్రి విజయవాడ హాస్పిటల్ లో మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భద్రాచలంలో మూడు సార్లు సిపిఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అవినీతి కతీతంగా, అతిసాధారణ జీవితం గడిపారు. అసెంబ్లీకి ఆటోలను, బస్సులను వెళ్లేవారు. ఆటోలో వస్తే నువ్వు ఎమ్మెల్యేవా అని అసెంబ్లీ సెక్యూరిటీ పోలీసులు అడ్డుకున్న విషయం తెలుసు. ప్రజల జీవితాలకు, దగ్గరగా, గిరిజనులకు అండగా నిలి చారు. నిత్య శ్రామికుడు ఎర్రజెండ ముద్దుబిడ్డ, అసెంబ్లీలో ఉద్యోగులు కార్మికులు, అంగన్వాడి, గ్రామసేవకులు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికు లు, ఆశ,యానిమేటర్స్, అసంఘటిత కార్మికులు, గిరిజనులు, దళితు లు, మైనార్టీలు, రైతులు, వ్యవసాయ కూలీలు, సమస్యల పైన అసెంబ్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిలదీసే వారు. బయట ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేవారు. అశేష ప్రజానీకం ఆత్మ బంధువు. మీకు మేమున్నాం అని ధైర్యం భరోసా ఇచ్చేవారు. సున్నం రాజయ్య మృతి, సిపిఎం పార్టీకి, వామపక్షాలకు, కార్మిక,శ్రామిక, అనగారిన వర్గాలకు తీరని లోటని, ఆయన జీవితం ఆదర్శమని తెలిపారు.