బ్రిడ్జిని పరిశీలించిన తహసీల్దార్... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 22, 2020

బ్రిడ్జిని పరిశీలించిన తహసీల్దార్...


పినపాక, 21 ఆగస్టు (శుభ తెలంగాణ): మండలం పరిధిలోని ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలోని బీటీ రోడ్డు, భీసువారిగూడెం చెక్ డ్యాం, పాతరెడ్డిపాలెం బ్రిడ్జి వరద తాకిడికి కోతకు గురైన ప్రాంతాన్ని తహ సీల్దార్ ఉమా మహేశ్వర రావు, పరిశీలించారు. అనంతరం ఏడూళ్ల బయ్యారంలో సాయినగర్ కానీలో వరదతో నీట మునిగిన అంతర్గత రోడ్లను అయన సందర్శించారు. తహసీల్దార్ మాట్లాడుతూ వరద ముంపు ఉన్న ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. నీట మునిగిన పంటలకు నివేదిక తయారు చేసి పైకి పంపిస్తున్నానని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో ఆఱ వీరభద్రం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు దొద్దా శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పోలిశెట్టి సత్తిబాబు,ఎగ్గడి శ్రీరామ్,కంది విజయ్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad