మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 21, 2020

మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ


కుత్బుల్లాపూర్ 20 ఆగస్టు (శుభ తెలంగాణ) : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లక్ష గణేష్ మట్టి విగ్రహాలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లతో కలిసి మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లలోనే పండుగను చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత , ఎస్ సి శంకర్ నాయక్, డిసిలు రవీందర్, మంగతాయారు, ఈఈలు కృష్ణ చైతన్య, మహేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్లు రావుల శేషగిరి రావు, విజయ్ శేఖర్ గౌడ్, మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ, యువ నాయకులు కేపీ విశాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.