రైతులకు కొత్త రుణాలు మంజూరు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 08, 2020

రైతులకు కొత్త రుణాలు మంజూరు


పినపాక, ఆగస్టు 7 (శుభ తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం ఈ బయ్యారం క్రా రోడ్ లో గల ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులకు కొత్త రుణాలు మంజూరయ్యాయని సహకార సంఘ చైర్మన్ రవి శేఖర్ వర్మ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సంఘానికి 70 లక్షల రూపాయలు మంజూరై నట్లు ఆయన తెలిపారు. సొసైటీ చైర్మెన్ వర్మ చేతుల మీదుగా కొంత మంది రైతులకు రుణాలను అందజేశారు .ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కొత్త సభ్యులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన సభ్యులు ఈ నెల 15 తేదీలోపు రైతులు దరఖాస్తులు చేసుకోవాలని, దానితో పాటు నోడ్యూ సర్టిఫికెట్ తీసుకొచ్చి రుణాలు పొందగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు కొండేరు రాము, రావుల కనకయ్య, మర్ల భూషణం, ముద్దం సతీష్, చిట్టి మల్ల వెంకట్ బ్యాంకు మేనేజర్ సృజన ,సొసైటీ సీఈవో రాంబాబు, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు