మండలంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పర్యటన.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 27, 2020

మండలంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పర్యటన..


చర్ల. ఆగస్టు 26 (శుభ తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇమ్ము నిజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ సత్యనారాయణ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరియు ఆరోగ్య కేంద్ర పరిధిలోని బట్టిగూడెంగ్రామంలో బుధవారం ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని పరిశీలిం చారు. డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పుడే ఇమ్యునైజేషన్ కార్యక్రమం ద్వారా టీకాలు ఇప్పించడం వల్ల రోగ నిరోధక శక్తి పెంపొంది తద్వారా వారి భవిష్యత్తును కాపాడిన వారమవు తాము అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో రోగనిరోధక శక్తి కలిగిన వారే ఏవైరస్ ప్రభావం నుండైనా త్వరగా బయటపడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణపురం వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డి.పి.ఎం. ఓ సత్యనారాయణ,ఎ.ఎన్.ఎమ్ రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, ముత్తమ, పి. హెచ్.ఎన్ పద్మావతి, ఉమాదేవి, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.