అంబులెన్స్ కోసం ఆరాటం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 07, 2020

అంబులెన్స్ కోసం ఆరాటం..


చిత్తూరు, ఆగస్టు 6 (శుభ తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్స్ వ్యవస్థ మళ్లీ ప్రాణం పోసుకుంది. లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఈ అంబులెన్స్ వ్యవస్థను మళ్లీ బతికించాలన్న ఉద్దేశంతో సర్కారు నడుం బిగించింది. అయితే ఒకేసారి ఎకంగా 1,088 వాహ నాలను (108, 104 కలిపి) కొత్త వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు వరదయ్య పాళెం మండలం లో మాత్రం 108 సర్వీసులు అందుబాటులో రాకపోవడం వల్ల మండల ప్రజలు చింతిస్తున్నా ను.వరదయ్య పాళెం మండలం చుట్టుపక్కల మండలాలు అయినటువంటి సత్యవేడు, బుచ్చి నాయుడు కండ్రిగ లో 108 అంబులెన్స్ సౌకర్యాలు అందుబాటులో ఉండి వరదయ్య పాళెం మండలంలో 108 సౌకర్యం లేకపోవడం వల్ల మండల ప్రజలు తీవ్రగా నష్ట పోతున్నారు. అయితే చాలా వరకు వరదయ్య పాళెం ప్రజలకు అత్యవసర పరిస్థితిలోనూ 108 సౌకర్యం దూర ప్రాంతం నుండి రావడం వల్ల అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అని దుఃఖిస్తున్నారు. ఇప్పటికి అయిన సరే సంబంధిత అధికారులు, నాయకులు ఈ సమస్యపై దృష్టి పెట్టి 108 అంబులెన్స్ సౌకర్యాలను వరదయ్య పాళెం మండల ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు.