వారం పాటు.. డర్ట్ క్విట్ ఇండియా - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 09, 2020

వారం పాటు.. డర్ట్ క్విట్ ఇండియా


స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వ ర్యంలో రాజ్ ఘాట్లో నెలకొల్పిన జాతీయ పారిశుధ్య కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. నేటి నుంచి ఆగస్టు 15 వరకు దేశం లో వారం రోజుల పాటు డర్ట్ క్విట్ ఇండియా వీక్ ప్రచారం నిర్వహించాలని మోదీ పిలుపు నిచ్చారు. ఆయా ప్రాంతాల కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మిం చాలని ప్రచారం చేయాలని అధికారులు కోరారు. స్వచ్చ భారత్ మిషన్ పై ఇంటరాక్టివ్ ఎక్స్ పీరియన్స్ కేంద్రంగా తీర్చిదిద్దిన రాష్ట్రీయ సచ్ఛతా కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు ప్రారంభించారు. మహాత్మాగాంధీ చేపట్టిన చంపారాన్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ స్వచ్ఛతా కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆర్ఎస్ కే లో స్వచ్ఛ భారత్ మిషన్'పై రూపొందించిన లఘ విడియోను ప్రధాని తిలకించారు. మహాత్మా గాంధీ సమాధి ఉన్న రాజ్ ఘాట్ వద్ద ఈ స్వచ్ఛ భారత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ పై భవిష్యత్ తరానికి దార్శనిక కేంద్రంగా అర్ఎస్ కే నిలుస్తుందని పీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది. 'మస బాల స్నేహితులు పరిశు భ్రత రంగంలో పెద్ద మార్పులు తీసుకురాగలరు. ఈ మొత్తం ఉ ద్యమంలో మీలాంటి బాల స్నేహితులు నాకు అతిపెద్ద భాగస్వాములు. పిల్లలు అవగాహనతో ఈ పని చేశారు. గత ఏడాది పెద్ద సంఖ్యలో గ్రాంధీజీ క్విట్ ఇండియా అంటూ ఉద్యమం చేపట్టిన రోజునే డర్ట్ క్విట్ ఇండియా వారోత్సవాలను రాజ్ ఘాట్ సమీపంలో ఉన్న పరిశుభ్రత కేంద్రం ప్రారంభోత్సవంతో చేపట్టడం సందర్భోచిత మైనది. 130 కోట్ల మంది భారతీయులకు బాపు పట్ల ఇది నివాళి' అని మోదీ చెప్పారు. భారతదేశాన్ని మురికిలో ఉ ంచినంత కాలం, భారతీయ ప్రజలకు విశ్వాసం కలిగించలేరని గాంధీజీకి తెలుసు. అందువల్ల, దక్షిణాఫ్రికా నుంచి చంపారన్, సబర్మతి వరకు ఆయన పరిశుభ్రతను తన కదలికగా చేసుకున్నారని తెలిపారు. 60 నెలల్లో దాదాపు 60 కోట్ల మంది భారతీయులు టాయిలెట్ సదుపాయంలో చేరారని, స్వచ్ఛ భారత్ అభియాన్ మన సామాజిక స్పృహ, మన ప్రవర్తనలో శాశ్వత మార్పు తీసుకువచ్చిందన్నారు. పదేపదే ఉమ్మివేయడం, చెత్తను ఎక్కడంటే అక్కడ విసిరేయడం మానుకోండని సూచించారు. పరిశుభ్రత ప్రచారం అనేది జీవితకాలం కొనసాగే ప్రయాణం అని పేర్కొన్నారు. ఓడీఎఫ్ తరువాత దేశం ఇప్పుడు ఓడీఎఫ్ ప్లస్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, వ్యర్థ పదార్థాల నిర్వహణ మరింత మెరుగుపరచాల్సిన అవసరమున్నదని చెప్పారు.