100 ఫీట్ల రోడ్డు విస్తరణ.. పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 01, 2020

100 ఫీట్ల రోడ్డు విస్తరణ.. పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే


సంగారెడ్డి జిల్లా ఆగస్టు 31(శుభ తెలంగాణ) : పటాన్ చెరువు నియోజకవర్గంలోని బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట్ వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. 50 కోట్ల రూపాయల వ్యయంతో త్వరితగతిన పనులు పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు విస్తరణకు నిధులు కేటాయించి సకాలంలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు విస్తరణ జరిగే సమయంలో ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానంద్, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, జడ్పీటీసీ ప్రభాకర్ చైర్మన్ పాండు రంగారెడ్డి, కిష్టారెడ్డి పెట్ సర్పంచ్ కృష్ణ, యమ్మెర్వో విజయ్ కుమార్, అమీన్పూర్ కమిషనర్ సుజాత, ఆర్లాండ్ బి, హెచ్ఎండిఎ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.