హైదరనగర్ 123 డివిజన్.. ప్రజా సమస్యలపై బిజెపి పోరాటం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 02, 2020

హైదరనగర్ 123 డివిజన్.. ప్రజా సమస్యలపై బిజెపి పోరాటం..


హైదర్ నగర్ సెప్టెంబర్ 1 (శుభ తెలంగాణ) : బీజేవైఎం రాష్ట్ర నాయకులు అరుణ్ కు నాయకత్వంలో డివిజన్ పరిధిలోని స్థానిక భాగ్యనగర్ కాలనీలో సరైన కొలతలతో ఫుట్ పాత్ నిర్మాణాలు చేపట్టకుండా, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాంప్లెక్స్ ముందు ఒక రకంగా, స్థానిక కాలనీ వ్యక్తుల కాంప్లెక్సు ముందు ఇంకొక విధంగా ఫుట్ పాత్ నిర్మాణాలు చేపట్టడం అనేది మంచి పద్ధతి కాదు అని ప్రశ్నించడం జరిగింది. ఇంకా ఆరునెలల్లో ఎలక్షన్ లో ఉండగా ఇప్పుడు ఇంత హడావుడి సృష్టించడం ఏమిటి అని ప్రశ్నించడం జరిగింది. స్థానికులు మాట్లాడుతూ కాలనీలో చిన్న రోడ్ల కారణంగా ఈ ఫుట్ పాల వల్ల పార్కింగ్ సమస్య తలెత్తడం జరుగు తుంది. అందువలన ఫుట్ పాత్ వద్దని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు వేణు గోపాల్ యాదవ్, జనరల్ సెక్రెటరీ ఎల్లేష్ ముదిరాజ్,బలిదా వెంకట్, డివిజన్ కోశాధికారి పాతూరి రామ్, నర్సింగ్, సాయి, గిరి, రాహుల్ మరియు స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.