చాకలి ఐలమ్మ 125వ జయంతి వేడుకలను... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 27, 2020

చాకలి ఐలమ్మ 125వ జయంతి వేడుకలను...


గజ్వేల్  సెప్టెంబర్ 26(శుభ తెలంగాణ) మర్కుక్   చేబర్తి గ్రామంలో లో చాకలి ఐలమ్మ 125వ జయంతి వేడుకలను గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మర్కుక్ మండల తాసిల్దార్ ఆరిఫా మాట్లాడుతూ ఆడది అంటే అబల కాదు సబల అని మహిళా లోకానికి ఐలమ్మ జీవితం స్పూర్తి దాయకమని రజాకార్లను ఎదిరించి భూమికోసం భుక్తి కోసం సామాజిక తెలంగాణ విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన ఐలమ్మ జయంతి మర్చిపోకుండా నిర్వహిస్తున్నందుకు గ్రామ ప్రజలను పాలకవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో లో వైస్ ఎంపీపీ బాల్రెడ్డి  ఆర్ ఐ రాజు స్వేరోస్ ఇంటర్నేషనల్ గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు చిన్నికృష్ణ, ఉప సర్పంచ్ స్వామి రైతుబంధు అధ్యక్షులు బాలనర్సయ్య  నాయకులు డి యన్  ఆర్ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మల్లేశం తిరుపతి జై రామ్ నర్సింలు ఆంజనేయులు బలరాం తదితరులు ఉన్నారు.