సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని.. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 09, 2020

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని.. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 8 (శుభ తెలంగాణ) : సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని అమీస్పూర్ మున్సిపాలిటీ లోని అమీస్పూర్ మండలం తాసిల్దార్ కి మంగళవారం వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి సతీష్ గౌడ్ రాష్ట్ర కన్వీనర్ మరియు ఎల్ మహేందర్ సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం రాకముందు ఒక మాట అధికారం వచ్చిన ఒక మాట అధికారం రాకముందు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి మాటమీద నిలబడలేదని ఇది సిగ్గుచేటు అని అన్నారు. త్వరలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కావునఈ విమోచన దినాన్ని అధికారికం గా ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాధురి కౌన్సిలర్ బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మరియు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్వరి, రమేష్ , వెంకట్,ఆనంద్ మండల ప్రధాన కార్యదర్శి మహిళా మోర్చా నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.