చెరువు అభివృద్ధి పనులకు.. రు.3.4 కోట్లు మంజూరు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 17, 2020

చెరువు అభివృద్ధి పనులకు.. రు.3.4 కోట్లు మంజూరు


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 16(శుభ తెలంగాణ): రామచంద్రపురం 112డివిషన్లో ఉన్న ఓల్డ్ రామచంద్రపురం రాయ సముద్రం చెరువులో 3 సంఎఎ వరకు ఉన్న గుర్రపు డెక్క తొలగించి, పెరగకుండా చూసుకోవడానికి నిధుల సుమారు 3.4 కోట్లు మంజూరు చెయ్యడం జరిగింది. దానికి గాను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్స్ రెడ్డిలు ముఖ్య అతిధులుగా విచ్చేసి, 112 డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్య ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చెయ్యడం జరిగింది. ఎమ్మెల్యే , కార్పొరేటర్ అంజయ్య కృషితోనే ఈపని మంజూరు అయింది అని ఎమ్మెల్సీ తెలి పారు. 3సం.వరకు దగ్గర ఉండి పనిని చేసుకోవాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు కార్పొరేటర్ కి తెలిపారు. వారితో డిప్యూటీ కమీషనర్ బాలయ్య, ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు మోహన్ రెడ్డి,లక్ష్మ రెడ్డి,సుంకు సమ్మయ్య,పరమేష్ యాదవ్,నగేష్ యాదవ్,కుమార్ గౌడ్,చిగురు శ్రీను, బీ కే.యాదయ్య, ఐలేష్, ప్రమోద్,యూసఫ్, లింగయ్య,మల్ల రెడ్డి, దేవేందర్, చారి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు