మృతుని కుటుంబనీకి 50లక్షల.. నష్టపరిహారం చెలించాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, September 17, 2020

మృతుని కుటుంబనీకి 50లక్షల.. నష్టపరిహారం చెలించాలి


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 16 (శుభ తెలంగాణ) పటాన్ చెరువు పాశం మైలారం పారిశ్రామిక వాడాలో సెప్టెంబర్ 10 నాడు జరిగిన గోర అగ్ని ప్రమాదంలో రామకృష్ణ అనే కార్మికుడు దుర్మరణం. యాజమాన్య నిర్లక్ష్యం మే కారణం. మృతుని కుటుంబ నీకి 50లక్షల నష్టపరిహారం చెలించాలి. యాజమాన్యం పై చర్యకు ఐ ఎన్ టి యు సి నాయకులు డిమాండ్ చేశారు. డిప్యుటీ చీఫ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర పురంకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికి అయినా పరిశ్రమల శాఖ మంత్రి కళ్ళు తెరవాలి గడిచిన ఐదు సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ సంగారెడ్డి జిల్లాలో ఇలా పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాలలో సుమారు 110 మృతి చెందారని ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింహారెడ్డి అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా ఐఎన్ టీయూసి, సుందర్ జిల్లా కార్యదర్శి జాకబ్ జిల్లా ఆర్గనేజింగ్ సెక్రటరీ మండల అధ్యక్షులు రవి నాయక్, ఎల్లయ్య పటాన్చెరు నాయకులు బస్వారాజ్ రాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు.