అక్టోబర్ లో కరోనా కేసులు.. 70లక్షలు దాటుతాయి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 13, 2020

అక్టోబర్ లో కరోనా కేసులు.. 70లక్షలు దాటుతాయి


హైదరాబాద్, సెప్టెంబర్ 12(శుభ తెలంగాణ): కరోనా కేసుల సంఖ్య పరంగా భారత్ అక్టోబర్ లో అమెరికాను దాటి పోయే అవకాశం ఉందని బిట్స్ పిలానీ సంస్థ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. హైదరా బాద్ క్యాంపస్ కు చెందిన ంగరు సభ్యుల బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. గత నాలుగు నెలల్లో నమోదైన కరోనా గణాంకాల ఆధారంగా రెండో మోడళ్లను రూపొందించిన శాస్త్రవేత్తలు.. కరోనా కేసుల సంఖ్య పరంగా భారత్ వచ్చే నెలలో అమెరికాను దాటిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. అక్టోబర్ తొలి వారంలో కరోనా కేసుల సంఖ్య 70 లక్షలకు చేరుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక | కేసులు కలిగిన దేశంగా భారత్ తొలిస్థానంలో నిలవచ్చు' అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టీఎస్ ఎల్ రాధిక వ్యాఖ్యా నించారు. 'సెప్టెంబర్ 5 లేదా 6న కేసుల సంఖ్యలో భారత్ బ్రెజిల్‌ను దాటిపోతుందని గతంలో మేము అంచనా వేశాము. ఈ అంచనాకు అనుగుణంగానే సెప్టెంబర్ 7న భారత్ అత్యధిక కరోనా కేసులు కలిగిన రెండో దేశంగా బ్రెజిలను అధికమించింది అని ఆమె తెలిపారు. గణాంకశాస్త్రానికి చెందిన ఆటోరిగ్రెస్, గ్రోత్ రేట్ మోడళ్ల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చామన్నారు.