అక్రమంగా నియమించిన.. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 15, 2020

అక్రమంగా నియమించిన.. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలి


భద్రాచలం. సెప్టెంబర్ 14. (శుభ తెలంగాణ) : ఏజెన్సీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమం ప్రభుత్వ కార్యాలయాలలో నియమించిన కాంట్రాక్టు ఉద్యోగు లను తక్షణమే తొలగించాలని భద్రాచలం ఆదివాసీ సమితి కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గిరిజనేతర ఒప్పంద కార్మికులను నియమించ డం వలన అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగులు నష్టపోతున్నారని భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పూనేం కృష్ణ దొర, పాయం రవి వర్మ లు మాట్లాడుతూ అనేక మంది చదువుకున్న గిరిజన నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే దొడ్డిదారిన చట్ట విరుద్ధంగా ప్రభుత్వం కార్యాలయాలలో గిరిజనేతరులను నియమించడం సరికాదన్నారు. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతూ ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా, పై అధికారుల అనుమతి లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు గిరిజనేతరులను ఒప్పంద కార్మికులుగా నియమించుకోవడం చట్టవిరుద్ధమని తెలిపారు. తక్షణమే అధికారులు, ప్రభుత్వం జోక్యం చేసుకొని గిరిజనేతరులకు అన్ని ప్రభుత్వ సంస్థలలో ఒప్పంద కార్మికులుగా నియమించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందించిన తర్వాత ప్రాజెక్టు అధికారి గౌతమ్ మాట్లాడుతూ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారన్నారు.