ఎల్లమ్మబండ స్మశాన వాటికను.. మోడల్ స్మశాన వాటికగా అభివృద్ధి చేస్తాం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 01, 2020

ఎల్లమ్మబండ స్మశాన వాటికను.. మోడల్ స్మశాన వాటికగా అభివృద్ధి చేస్తాం


కూకట్ పల్లి 31 ఆగస్టు (శుభ తెలంగాణ) : ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ ప్రాంతంలో స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని స్థానికులు ఎమ్మెల్యే గాంధీ ను మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ను కోరారు. ఈ విషయమై వారు కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత దృష్టికి తీసుకువెళ్లారు స్పందించిన జోనల్ కమిషనర్ మమత సోమవారం ఎల్లమ్మబండ స్మశాన వాటిక ను పరిశీలించారు ఇప్పటికే స్మశాన వాటిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు వీలైనంత తొందరగా మోడల్ స్మశాన వాటిక అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసిడి ఈ గోవర్ధన్, ఏఈ సుభాష్ డివిజన్ అధ్యక్షుడు గణేష్,వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్ ఉన్నారు.