అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 12, 2020

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు


రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 11(శుభ తెలంగాణ) : ఇల్లంతకుంట మండలంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టగా హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, యువమోర్చ అధ్యక్షులు బండారి రాజ్, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రవణ్,పల్లె సాయి ప్రసాద్ రెడ్డి, చల్లూరి భానులను, మండల భారతీయ జనతా పార్టీ నాయకులను హైదరాబాద్ వెళ్లకుండా ముందస్తుగా పోలీస్ అధికారులఫై ఒత్తిడి చేస్తూ ఈ తెలంగాణ దౌర్భాగ్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశ్నించే గొంతులను అక్రమాంగా అరెస్టులు చేపిస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వంనికి ప్రజలు రానున్న రోజులలో తగిన గుణపాఠ చెప్తారు. అని అన్నారు..