గంజాయిని పట్టుకున్న పోలీసులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 13, 2020

గంజాయిని పట్టుకున్న పోలీసులు..


భద్రాచలం సెప్టెంబర్ 12(శుభ తెలంగాణ) : భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ నందు గల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పట్టణ సీఐ స్వామి ఆధ్వర్యంలో ఎ మహేష్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఏ పి 29 కే ఏ 5469 అనే నెంబర్ గల బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ నిషేధిత గంజాయి ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వాహనం నందు 89.800 కేజీల గంజాయి లభ్యమైందని, దీని విలువ సుమారు 13, 47,000 గా ఉ ంటుందన్నారు. ముద్దాయిలను విచారించగా 1. సంతోష్ యాదవ్. కర్ణాటక. 2. ఆకాశ్ జాదవ్. కర్ణాటక గా తెలిసిందన్నారు. సీలేరు నుండి హైదరాబాదుకు గంజాయి తీసుకు వెళుతున్నట్లు తెలిపారని అన్నారు. భద్రాచలం పట్టణ సరిహద్దుల్లో 24 గంటలు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారని, ప్రభుత్వ నిషేధిత వస్తువులను తరలించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎస్ ఐ రామయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.