రవీంద్రభారతి వద్ద నిరుద్యోగి ఆత్మహత్యయత్నం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 11, 2020

రవీంద్రభారతి వద్ద నిరుద్యోగి ఆత్మహత్యయత్నం


హైదరాబాద్, సెప్టెంబర్ 10(శుభ తెలంగాణ): రవీంద్ర భారతి వద్ద నిరుద్యోగి ఒకరు ఆత్మహత్యాయత్నం చేసే యత్నం చేయడం కలకలం రేగింది. రవీంద్ర భారతి ముందు రాములు అనే నిరుద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగం వస్తుందని ఆశించాడు. అయితే సొంత రాష్ట్రంలో ఉద్యోగం రాక నానా అవస్థలు పడ్డాడు. ఇక చేసేది లేక ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరాడు. 'కరోన'తో స్కూళ్లు మూతపడడంతో జీవనోపాధి కరువై అడుక్కోవడానికి మనస్సు రాక మనస్థాపానికి గురై ఒంటికి నిప్పంటించుకుని రాములు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. తెలంగాణ వచ్చిన తరువాత తనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరుచుకుంటూ రాములు పెట్రోల్ పోసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాములు మంటల్లో కాలుతూ 'జై తెలంగాణ' అంటూ నినాదాలు ఇచ్చాడని చెబుతున్నారు. వెంటనే పసిగట్టిన పోలీసులు అప్రమత్తమయ్యారు. మంటలు ఆర్పేసి రాములును హాస్పిటల్ కు తరలించారు. సీఎం కేసీఆర్ తనకు న్యాయం చేయమని బాధితుడు అరిచినట్టు స్థానికులు చెబుతున్నారు. తాను బతకడానికి పని లేదంటూ రాములు బిగ్గరగా అరిచినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడంపై పోలీసులు అప్రమత్తయ్యారు. విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు పడుతున్నారు.