చెరువులో మత్స్యకారుడు మృతి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 02, 2020

చెరువులో మత్స్యకారుడు మృతి..


గజ్వేల్: సెప్టెంబర్ 1 (శుభ తెలంగాణ) : గజ్వేల్ పాండవుల చెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకార సోదరుడు రీడ్డమైన్ననాగులు గత ఆదివారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పాండవులు చెరువులో పడి మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితుని కుటుంబ సభ్యులను పరామర్శించారు సానుభూతి తెలపడం జరిగింది. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మృతునికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉ న్నందున ప్రమాద భీమాను అందిస్తామన్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో లో గజ్వేల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గుంటకు శ్రీనివాస్, గంటకు రాజు వారి సంఘ సభ్యులు చింత శ్రీనివాస్ , గుంటూకు స్వామి, మరియు గడియారం స్వామి వారి గడిపల్లి బలరాం, గ్రామ సభ్యులు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.