ప్రణబ్ చిత్రపటానికి నివాళులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 02, 2020

ప్రణబ్ చిత్రపటానికి నివాళులు..


మణుగూరు సెప్టెంబర్ 1(శుభ తెలంగాణ) : పట్టణ పరిధిలోని కాంగ్రెస్ మండల కార్యాలయంలో మంగళవారం దివంగత నేత ప్రణబ్ ముఖర్జీకి పినపాక నియోజకవర్గ కన్వీనర్ డా. చందా సంతోష్ కుమార్ నివాళు లర్పించారు. ముందుగా ప్రణబ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి మౌనం పాటించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సంతోష్ కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. ఈ దేశం కోసం ఎంతో సేవ చేసిన ప్రణబ్ ముఖర్జీ మృతి ఎంతో బాధాకరం అన్నారు. పార్టీలో అనేక సంక్షోభాలకు తన మేధా శక్తితో ధీటుగా సమాధానం చెప్పారని కీర్తించారు. ఆయన మాటల్లో ప్రేమ, వాత్సల్యం కనిపించేవని ఆయన పేర్కొన్నారు. ప్రణబ్ నేటి రాజకీయ నాయకులకు ఆదర్శ ప్రాయులు అని కొనియాడారు. దేశం, కాంగ్రెస్ పార్టీ ఒక శిఖరాన్ని కోల్పోయింద న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆయన ఎనలేని కృషి చేశారన్నా రు. ప్రపంచ ఉత్తమ ఆర్థిక వ్యక్తిగా, బెస్ట్ ఫైనాన్సియల్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ గా పేరొందినది ఒక ప్రణబ్ ముఖర్జీ నేనని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మణుగూరు పట్టణ అధ్యక్షులు పీరినాకి నవీస్, మహిళ కార్మికశాఖ జిల్లా అధ్యక్షురాలు బోగినేని వరలక్ష్మి, మాజీ ఎంపీటీసీ ముక్కెర లక్ష్మణ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నూరుద్దీన్, గోళ్ళ సాంబశివరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు ముక్కెర మధు, మిట్టపల్లి నితిన్ తదితరులు పాల్గొన్నారు.