ఏజెన్సిలో హై టెన్షన్.. హైఅలర్ట్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 08, 2020

ఏజెన్సిలో హై టెన్షన్.. హైఅలర్ట్..


చర్ల సెప్టెంబర్ 07(శుభ తెలంగాణ): ఆదివారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్ద మిడిసిలేరు గ్రామం నుంచి తాలిపేరు. ప్రాజెక్టుకు వెళ్ళే మార్గంలోని తగిడవాగు వంతెన సమీపంలో రహదారిని ఐఈడి బాంబుతో పేల్చి ద్వంసం చేసిన మావోయిస్టులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవల్లగూడెం అటవీ ప్రాంతంలో సెప్టెంబర్ 3 గురువారం జరిగిన శంకర్ ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ ఘటనకు పాల్పడ్డారని భావిస్తున్న పోలీసులు. ఆదివారం మావోయిస్టులు ఉత్తర తెలంగాణ బందుకు పిలుపునిచ్చిన నేపధ్యంలో ఈ ఘటన అత్యంత ప్రాధాన్యత సంచరించుకుంది. ఘటనా స్థలంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ, ఏటూరు నాగారంమహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేర్లతో కరపత్రలు వదిలిన మావోయిస్టులు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి విడుదల అయిన పత్రికా ప్రకటన ప్రకారం పోలీసులకు ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు చర్ల ప్రాంతంలో మావోయిస్టులు ఎక్కువగా సంచరించే అనుమానిత ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించిన పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు మరియు బలగాలు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పూసుగుప్ప అటవీ ప్రాంతంలో పోలీస్ బలగాలకు మరియు మావోయిస్టులకు సుమారుగా 20 నిమిషాల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. అనంతరం కాల్పులు జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించిన రక్షణ బలగాలు. ఘటనా ప్రదేశంలో 01 ఎస్ బి బి ఎల్ తుపాకీ, 01 పిస్టల్ మరియు రెండు కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో వరుస ఘటనలతో ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు.