తెలంగాణ ప్రభుత్వం రజక కార్పొరేషన్.. చైర్మనను నియమించాలి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 06, 2020

తెలంగాణ ప్రభుత్వం రజక కార్పొరేషన్.. చైర్మనను నియమించాలి..


హైదరాబాద్ : రామంతపూర్‌లో తెలంగాణ రజక రిజర్వేషన్ సమి తి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక నివాసంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో మాట్లాడుతూ రజకులకు రెండు బడ్జెట్ కేటాయించిన 450 కోట్లు పేపర్ ప్రకటనలకు మాత్ర మే పనికొచ్చాయని ఏ ఒక్క లబ్ధి దారునికి గత 6 సం.లనుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మొన్న బడ్జెట్లో రజకులకు ఎలాంటి కేటాయింపు చేయక పోవడం బాధాకరమని వాపోయారు. రజక కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే కొంత సహాయం పొందే అవకాశం ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రజక కార్పొరేషన్ చైర్మన్ ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూ.లు కేటాయించాలని కోరారు. బంగారు తెలంగాణలో రజక కులస్తుల బ్రతుకులు రోజు రోజుకు ఆగమైపోతున్నాయని వారు బాధను వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.