దుబ్బాక ఉప ఎన్నికల్లో.. ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతే... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 19, 2020

దుబ్బాక ఉప ఎన్నికల్లో.. ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతే...  జగదేవపూర్: సెప్టెంబర్ 18(శుభ తెలంగాణ) : దుబ్బాకలో త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని టీఆర్ఎస్ పార్టీ జగదేవపూర్ మండల అధ్యక్షుడు పనగట్ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ త్వరలో దుబ్బాకలో జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ లక్ష మెజారిటీతో గెలవడం భా యమని దీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలను ఎంత నమ్మించిన , ప్రజలు నమ్మేస్థితిలో లేరని టీఆర్ఎస్ కే పట్టం కడుతారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలుపుకు శ్రీరామరక్ష అని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఓట్లు రాగానే గ్రామాల్లోకి వచ్చి టీఆర్ఎస్ ను విమర్శిం చడం సరికాదన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపును ఆపేతరం ఏ పార్టీకి లేదన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు కారు.. సర్కారు.. కేసీఆర్ అంటూ ప్రతిజ్ఞలు చేస్తు న్నారని పేర్కొన్నారు. దుబ్బాక ప్రజలు ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను గమనిస్తున్నారని, ఓట్లతో వారికి సరైన బుద్ధి చెప్తారు.