అనారోగ్యంతో మృతి చెందిన.. కుటుంబానికి ఆర్థిక సహాయం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, September 02, 2020

అనారోగ్యంతో మృతి చెందిన.. కుటుంబానికి ఆర్థిక సహాయం..


రాజన్న సిరిసిల్ల జిల్లా సెప్టెంబర్ 1 (శుభ తెలంగాణ) : జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం రాజన్న పేట గ్రామంకి చెందిన నాంపెల్లి బాలరాజ్ కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు తన బార్య స్రవంతి వారికి ఇద్దరు కుమారులు హర్షవర్ధన్ వయసు (1సం), కృష్ణ వర్ధన్ వయసు(2 సం)కుటుంబ పోషణ చిన్నారుల ఆలనా పాలన చూసుకుటు హప్పన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హె, మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి చిన్న పిల్లలను ఆదుకోవడానికి తన వంతు సహాయంగా పిల్లలు బ్రతకడానికి 50 వేల రూపాయల అందించడం జరి గింది. వీటితో పాటుగా 100కిలోల బియ్యం, వారు కట్టుకోడానికి బట్టలు మంగళవారం రోజున జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్గే మాట్లాడుతూ అభం శుభం తెలియని చిన్నపిల్లలు ఇంత చిన్న వయసులోనే తండ్రిని కోల్పో వడం చాలా బాధాకరంగా ఉందన్నారు. వారికి అన్ని వేళలా అండగా ఉంటాం అని ఎస్పీ చెప్పారు. ఈ కార్యక్ర మంలో సిరిసిల్ల డిఎస్పీచంద్రశేఖర్, సి.ఐ బన్సీలాల్, ఎల్లారెడ్డిపేట ఎస్.ఐ వెంకటకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.