ఏటీఎం చోరీ దొంగలను.. రిమాండకు తరలించిన పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, September 06, 2020

ఏటీఎం చోరీ దొంగలను.. రిమాండకు తరలించిన పోలీసులు


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 5 (శుభ తెలంగాణ) : పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ఎటిఎం లలో చోరీలకు పాల్పడి గ్యాస్ కట్టర్ల సహాయంతో ఎటిఎం లను ధ్వంసం చేసిన కేసుల్లో నింధితులను శుక్రవారం రాత్రి మరో ఎటిఎం లో దొంగతనం కు పాల్పడుతుండగా రెడ్ హ్యాండెడ్ గ పట్టుకున్న పోలీసులు, మీడియా ముందు ప్రవేశ పెట్టారు, కారోన సమయంలో వరుసగా ఎటిఎంలను టార్గెట్ చేసుకొని అమీన్పూర్, పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు ఎటిఎం లలో దొంగతనాలు చేసి. రుద్రారంలోని మరో ఏటీఎంలో దొంగతనం చేస్తుం డగ రామచంద్రపురంకి చెందిన అబ్దుల్ ఖలీల్ తో పాటు ఎరుకల మహేష్ అనే ఇద్దరు యువకులను పట్టుకున్నారు. గ్యాస్ కట్టర్ల సహాయంతో చోరీలకు యత్నం చేసిన ఎలాంటి డబ్బులు దొంగలించ బడలేదని, నిన్న రాత్రి పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలోని మరో ఎటిఎంలో చోరీకి ప్రయత్నిస్తుండగా నిందుతులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనాన్ని, గ్యాస్ సిలిండర్లు, కట్టర్ తో పాటు పనిముట్లను స్వాధీన పరుచుకొని రిమాండ్ కి తరలిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించిన పోలీసులు.