సిసి రోడ్ పనుల శాంక్షన్ కోసం.. జోనల్ కమిషనర్ కి వినతిపత్రం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, September 05, 2020

సిసి రోడ్ పనుల శాంక్షన్ కోసం.. జోనల్ కమిషనర్ కి వినతిపత్రం


సంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 4 (శుభ తెలంగాణ ) లింగంపల్లి గచ్చిబౌలిలో ఉన్న జిహెచ్ఎంసి వెస్ట్ జోన్ జోనల్ ఆఫీస్ లో జోనల్ కమీషనర్ రవి కిరణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి రామచంద్ర పురం 112 డివిషన్లో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీ, అశోక్ నగర్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ, కాకతీయ సగర్, మయూరి నగర్, ఇతర ఇతర కాలనీలలో బాలన్స్ ఉన్న సిసి రోడ్ పనులు శాంక్షన్ చేయమని సుమారు 4.81కోట్ల పనుల కొరకు వినతపత్రం ఇచ్చిన 112 డివిజన్ కార్పొరేటర్ తొంట అంజయ్య. ముక్యంగా శ్రీనివాస్ నగర్ కాలనీ బస్సు రూట్, శ్రీనివాస్ నగర్ కాలనీలో మిషన్ కాకతీయ పైప్లైన్ వేసిన తరువాత డామేజ్ అయినా రోడ్స్ వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనో కార్పొరేటర్ జోనల్ కమీషనర్ కి తెలుపడం జరిగింది. దానికి గాను జోనల్ కమీషనర్ సానుకూలంగా స్పందించి ఎమర్జెన్సీ ఉన్న పనులను వెంటనే మంజూరు చేస్తా అని హామీ ఇచ్చారు. దానికి కాను కార్పొరేటర్ జోనల్ కమీషనర్ కి ధన్యవాదములు తెలుపడం జరిగింది.