బాచుపల్లి నైన్ స్టార్ హెటల్ దగ్గర.. రెండు టిప్పర్లు యాక్సిడెంట్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, September 11, 2020

బాచుపల్లి నైన్ స్టార్ హెటల్ దగ్గర.. రెండు టిప్పర్లు యాక్సిడెంట్


కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 10(శు భ తెలంగాణ) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని బాచు పల్లి చౌరస్తా దాటిన తర్వాత ఉ న్నటువంటి నైన్ స్టార్ హోటల్ చౌరస్తా దగ్గర టిప్పర్ ఏపీ 25 డబ్ల్యూ ఓ 112 రెండవ టిప్పర్ ఏపీ 12 యు బి 90 34 గల టిప్పర్లు ఒకటి ఒకటి ప్రమాదం జరగడంతో అందులో యాక్టివా 07 ఈ ఈ 71 54 గల వాహనం పై బహుదూర్ పల్లి నుండి బాచుపల్లి కౌసల్య కాలనీ లో ఉన్న తమ బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వెళ్తున్న తరుణంలో ఆ టిప్పర్ ప్రమాదంలో యాక్టివా ఫై వస్తున్నటువంటి భార్య భర్తల లో భార్య లక్ష్మి వయస్సు 38 అనే మహిళ మరణించగా వారి భర్త ఎం శ్రీనివాస్ వయసు 52 సంవత్సరాలు కు భారీగా దెబ్బలు తగిలి కాలుకు రెండు మూడు చోట్ల విరిగిన వీరిని బాచుపల్లి సమీపంలోని మమత హాస్పిటల్ తరలించడంతో అక్కడ మహిళ మరణించిందని మరణించిన మహిళను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ పోలీసులు పంపారు. టిప్పర్ డ్రైవర్ ఒకరు పరారీలో ఉండగా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.