ఆన్లైన్ తరగతుపై అవగాహన.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 01, 2020

ఆన్లైన్ తరగతుపై అవగాహన..


రాజన్న సిరిసిల్ల జిల్లా ఆగస్టు 31 (శుభ తెలంగాణ) : ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు,తల్లి తండ్రులకు ఆన్లైన్ తరగతులపై అవగాహన కోసం ఏర్పరచిన ఫ్లెక్సీ లను ఆవిష్కరించిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ అనంతరం విద్యార్థులకు , తల్లిదండ్రుల కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ కోవిడ్ -19 దృశ్యా విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దని తెలంగాణ ప్రభుత్వం తేదీ 01/09/2020 నుండి ఆన్లైన్ (దృశ్య - శ్రవణ) మాధ్యమాల ద్వారా తరగతులను నిర్వహిస్తుంది. తల్లి తండ్రులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి విద్యార్థులను ప్రసార మాధ్యమాల ద్వారా చూసి,వినేల చూడాలని కోరారు. దూరదర్శన్ సప్తగిరి,టీ సాట్ ఛానల్ లు ప్రసారం చేస్తున్నాయి. అన్ని డి.టి. హెచ్ ఛానల్ లు కూడా ప్రసారం చేస్తున్నాయి. పిల్లలకు , తల్లిదండ్రుల అవగాహన కోసం గ్రామ ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీ లను ఏర్పరచిన ఉపాధ్యాయులను వైఎం.పి.పి. శ్రీనాథ్ గౌడ్ అభినందిం చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.