కాంగ్రెస్ పార్టీ కార్యాలయం.. అప్పగించే వరకు పోరాటం చేస్తాం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, September 08, 2020

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం.. అప్పగించే వరకు పోరాటం చేస్తాం


మణుగూరు. సెప్టెంబర్ 17. (శుభ తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అప్పగించే వరకు పోరాటం చేస్తామని పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డా. చందా సంతోష్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అప్పగ్గించాలని ఆదివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను భద్రాచలం శాసనసభ్యులు పోదేం వీరయ్య ప్రారంభించారు. సోమవారం తెల్లవారు జామున ఆమరణ దీక్ష ను పోలీసులు భగ్నం చేసి చందా సంతోష్ ను హాస్పిటల్ కి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు ఇచ్చిన భూమి, డబ్బుతో పార్టీ భవనాన్ని నిర్మించామని, రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడిగా ఉన్న కాలంలో నిర్మించామని, ఆయన పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ భవనానికి తెలంగాణ భవన్ అని నామకరణం చేసి, రంగులు మార్చి, పార్టీ భవనాన్ని స్వాధీనం చేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. తక్షణమే సీఎం కేసీఆర్ కలుగజేసుకొని పార్టీ భవనాన్ని అప్పగించాలని, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి పార్టీ మారడమే పెద్ద తప్పు అని, అలాంటిది పార్టీ కార్యాలయాన్ని కూడా కట్టా చేయడం, నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఎమ్మెల్యే నే ఇలా చేయడం సరైన పద్ధతి కాదని, తక్షణమే పార్టీ కార్యాలయాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయాన్ని అప్పగించే వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు గురిజాల గోపి, పట్టణ అధ్యక్షుడు నవీన్, ఐ ఎస్ రావు, పార్టీ నాయకులు , కార్యకర్తలు రాల్లీలో పాల్గొన్నారు.